భద్రాచలం : కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఈరోజు (శుక్రవారం) ఓ బహిరంగ సభలో గుండేపోటుకు గురైన తోటి కాంగ్రెస్ నేతకు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు.
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే వెంకటరావు భద్రాచలం పర్యటనలో ఉండగా, వారితో పాటు వస్తున్న కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు… సుధాకర్ కు వెంటనే సీపీఆర్ చేసి, విజయవంతంగా ఆయనను బ్రతికించారు. సుధాకర్ స్పృహలోకి వచ్చిన తర్వాత, తదుపరి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కాగా, రాజకీయాల్లోకి రాకముందు వెంకటరావు వృత్తిపరంగా శిక్షణ పొందిన వైద్యుడు. ప్రాణాలను కాపాడడంలో కీలకమైన ఆయన త్వరిత ఆలోచన, వైద్య నైపుణ్యం ఆయనకు ప్రజల నుండి తోటి నాయకుల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టాయి.