TG | కారు బీభత్సం… ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో వారికి ప్రాణాపయం తప్పింది. స్థానికులు స్పందించి గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిందిలా…
శంకర్ పల్లి నుంచి నార్సింగికి ఇవాళ తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులు కారులో వస్తుండగా గండిపేట్ సమీపంలో సీబీఐటీ కళాశాల వద్ద పిల్లర్‌ను ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణాపయం తప్పింది. కారు అతివేగంగా ప్రయాణించడం వల్లే అదుపు తప్పి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.