TG | బంగారుపల్లి కంటైనర్ స్కూల్‌దేశానికే రోల్ మోడల్ – ఏఐసీసీ కితాబు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా బంగారుపల్లి కంటైనర్ స్కూల్ దేశానికే మోడల్ అని ఏఐసీసీ పేర్కొంది. ఈ కంటైనర్ స్కూల్ విజయ గాథను తాజాగా ఎక్స్ వేదికగా ఏఐసీసీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆటంకాలను అధిగమించి ప్రతి చిన్నారికి విద్యనందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, కాంగ్రెస్ సర్కార్‌లో విరబూసిన విద్య హక్కు చట్టం అంటూ పేర్కొంది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో ముందుకు సాగుతూ ప్రజాపాలన అందించాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను బంగారుపల్లి కంటైనర్ స్కూల్‌దే శానికే రోల్ మోడల్నెరవేరుస్తుందని తెలిపింది.
ఈ మేరకు ఎక్స్‌లో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. కంటైనర్ స్కూల్ పై మంత్రి సీతక్క పోస్టుదేశానికి రోల్ మోడల్ గా ములుగు కంటైనర్ పాఠశాల అంటూ వివరాలను మంత్రి సీతక్క పోస్టు చేశారు. ములుగు జిల్లాలో సెప్టెంబర్ 2024 లో తెలంగాణ తొలి కంటైనర్ స్కూల్ మంత్రి సీతక్క ప్రారంభించారు.
పోస్టు వివరాలు ఇలా ఉన్నాయి… అటవీ ప్రాంతం అయిన బంగారు పల్లి గ్రామంలో 13 లక్షలతో మంత్రి సీతక్క చొరవ, కలెక్టర్ దివాకర్ అత్యంత వినూత్న ఆలోచనతో కంటైనర్ స్కూల్ ఏర్పడింది. అక్కడ నడుస్తున్న పాత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అటవీ ప్రాంతం కావడంతో పాఠశాలకి నూతన భవనం నిర్మించుకుంటామని చెబితే.. అటవీ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ ప్రాంతంలో గూడాలన్నీ కూడా రిజర్వ్ అటవీ ప్రాంతం పరిధిలోనివి. దీంతో అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు మంజూరు కావు. రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతుంటాయి.
దీంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇది 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు. ఈ పాఠశాల ఏర్పాటుతో అక్కడి ఆదివాసీ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా మారింది.