హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న భూభారతి పోర్టల్ , బిఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ పై నేడు శాసన సభలో హాట్ హాట్ చర్చ జరిగింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖల పద్దులపై చర్చ సందర్భంగా బిఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ తేచ్చేది భూ భారతి కాదు భూ హారతి అంటూ ఆరోపించారు. ప్రస్తుతం కెసిఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగానే రైతుల రుణ మాఫీ, రైతు బంధు, రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని అన్నారు.. ప్రజలకు మంచిగా సేవలందిస్తున్న ధరణి సేవలను ఎందుకు నిలిపివేయాలని అనుకుంటుందో సమాధానం చెప్పాలని నిలదీశారు.. దీనిలో భాగంగా మల్లీ జమాబందీని కూడా తీసుకొస్తున్నరని మండి పడ్డారు పల్లా..
దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ,సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందని అన్నారు. దున్నే వాడిదే భూమి కదా.. సాయుధ పోరాట నినాదమని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అంటూ మండిపడ్డారు. అందుకే ధరణిని బంగాళాఖాతం లో వేస్తామని చెప్పామని అన్నారు. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన హక్కులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని కామెంట్ చేశారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పై ప్రజలు తీర్పు ఇచ్చారు.. మా సభ్యులే కాదు.. మీ వైపు ఉన్న సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.. ధరణిలో ఏర్పడిన సమస్యలతో తమ భూముల సమస్యలు పరిష్కారం కోసం నా దగ్గరికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు వెల్లడించారు. మేము వచ్చే ఎన్నికల్లో భూ భారతి గురించి చెప్పి ఎన్నికలకు పోతాం.. బీఆర్ఎస్ ధరణి పేరుతో ఎన్నికలకు వెళ్తారా? అని ప్రశ్నించారు. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు.. ధరణి తెచ్చి రూల్స్ అసలు ఫ్రేమ్ చేయలేదు.. మేము చట్టం తెచ్చి రూల్స్ సిద్ధం చేస్తున్నాం.. మీరు మాకు చెప్పడం ఎందుకు అని క్వశ్చన్ చేశారు. బీఆర్ఎస్ నేతలు కట్టుకథలు చెప్పి, ప్రజల్ని మోసం చేసే పనిలో ఉన్నారు అని మంత్రి పొంగులేటి విమర్శించారు.
అలాగే, వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థపై గత ప్రభుత్వానికి ఎంత కమిట్ మెంట్ ఉందో ప్రజలకు తెలుసు అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. డబులు బెడ్ రూం ఇస్తాం అని చెప్పింది ఎవరు.. మీరు పింక్ కలర్ వేసుకున్న వాళ్లకు ఇండ్లు ఇచ్చారు.. పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నాం.. వాళ్ళ మాదిరిగా మేము పార్టీల కార్యకర్తలు ఇవ్వం అని తెలిపారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక, ఇందిరమ్మ కమిటీ ఛైర్మన్ సర్పంచ్.. మీలాగా బీఆర్ఎస్ నాయకులను పెట్టలేదు.. సభను పడే పదే తప్పుదోవ పట్టిస్తున్నారు అని మంత్రి పొంగులేటి తీవ్రంగా మండిపడ్డారు.
దీనిపై ఘాటుగా స్పందించిన పల్లా దరణితోనే తాము మళ్లీ ఎన్నికలకు వెళతామని, మీరు భూ భారతితో ఎన్నికలలో పోటీ చేస్తారా అంటూ సవాలు చేశారు.