TG | అసెంబ్లీ మీడియా అడ్వ‌యిజ‌రీ కమిటీ ఏర్పాటు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly ) మీడియా అడ్వ‌యిజ‌రీ క‌మిటీ (ఎంఏసీ)ని రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాదరావు (speaker gaddam prasadaero ) , శాస‌న మండ‌లి చైర్మ‌న్ సుఖేందర్ రెడ్డి (council chairman gutta sukhendra reddy ) ఏర్పాటు చేశారు. క‌మిటీ చైర్మ‌న్‌గా ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో-చైర్మ‌న్ గా పోలోజు పరిపూర్ణాచారిని నియమించారు. ఈ క‌మిటీలో 13 మంది స‌భ్యులు ఉంటార‌ని రాష్ట్ర శాసనసభ సంయుక్త కార్యదర్శి సీహెచ్. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క‌మిటీ కాల‌ప‌రిమితి రెండేళ్లు అని పేర్కొన్నారు.

ఈ కమిటీలో ఐతరాజు రంగరావు, బొడ్లపాటి పూర్ణచంద్రరావు, లక్కడి వెంకట్ రామ్ రెడ్డి, పోలంపల్లి ఆంజనేయులు, ఎం.పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సురేఖ అబ్బూరి, మహమ్మద్ నయీం వజాహత్, బసవ పున్నయ్య, ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచు అశోక్, బి. హెచ్ ఎం.కే గాంధీలను స‌భ్యులుగా నియ‌మించారు.

Leave a Reply