TG | పరకాల మున్సిపాలిటీకి చేరిన పోలింగ్ బాక్స్

TG | పరకాల మున్సిపాలిటీకి చేరిన పోలింగ్ బాక్స్

TG | పరకాల, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించికొని పోలింగ్ బాక్సులు కార్యాలయానికి చేరుకున్నాయి. పరకాల మున్సిపాలిటీ 22 వార్డుల పోలింగ్ కోసం 44 పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ సోమిడి అంజయ్య నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈనెల 28 నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు మున్సిపల్ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ క్రమంలో హనుమకొండ డిపిఓ పరిధిలో ఉన్న పోలింగ్ బాక్స్ లను పరకాల మున్సిపల్ కార్యాలయానికి మంగళవారం రోజు సాయంత్రం పరకాల మున్సిపల్ ఆర్ఐ గూబల రవి ఆధ్వర్యంలో తరలించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 44 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ సోమిడి అంజయ్య తెలిపారు.

Leave a Reply