TG | ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు..

TG | ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు..
TG | ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గౌడ సంఘ భవనంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని గౌడ సంఘం అధ్యక్షుడు గొడిశాల కుమారస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ పౌరుల హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాలు పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుందని రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల అమలు ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ఉపాధ్యక్షుడు గోడిశాల రాజేష్ గౌడ్, క్యాషియర్ శ్రీపతి సదానందం, కల్లుగీత కార్మిక సంఘ మండల అధ్యక్షుడు జనగాని లక్ష్మీనారాయణ, కందాల మొగిలి, జనగాని సురేష్, రాజు, ప్రవీణ్, గొడిశాల సుమన్, గొడిశాల విక్రమ్, శ్రీపతి బిక్షపతి, రాజ్ కుమార్, విజయ్, కొత్తకొండ కుమార స్వామి, బత్తిని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
