మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత

మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత
9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి ఆధ్వర్యంలో
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతిని కుటుంబానికి కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి నిత్యవసర సరుకులు అందజేశారు. పరకాల పట్టణంలోని తొమ్మిదవ వార్డులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కొయ్యడ వేణు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న స్థానిక వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేయడంతో పాటు ఆర్థికంగా సహాయం చేసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కష్టకాలంలో తోడుగా నిలిచిన కౌన్సిలర్ పూర్ణాచారికి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలుస్తూ తన దయార్ద్ర హృదయాన్ని చాటుకుంటున్నారని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వేణు కుటుంబ సభ్యులు తండ్రి ప్రభాకర్, తల్లి స్వరూప,అన్న రాజు, నాగరాజు, రామగిరి సత్యం,మరియు పెగడ ధనుంజయ, దాసరి వెంకన్న,వావిలాల రవీందర్, దాసరి రవి, క్యాతం రమేష్, సంఘ పురుషోత్తం, సంఘ నరేష్, సంఘ ప్రభాకర్, మంత్రి చక్రపాణి, పిట్ట అనిల్, శ్రీనివాస్, కూర శ్రీధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
