పహారి గోడ నిర్మాణానికి భూమి పూజ..

పహారి గోడ నిర్మాణానికి భూమి పూజ..
ప్రభుత్వ పాఠశాల పహరి గోడ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సర్పంచ్ పెంట వార్ దశరథ్
కుంటాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాల పహరి గోడ నిర్మాణానికి 32 లక్షల తో ఎన్.ఆర్ఇజిఎస్ ద్వారా నిధులు మంజూరు కావడంతో స్థానిక సర్పంచ్ పెంట వార్ దశరథ్ ప్రభుత్వ పాఠశాల పహరి గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 32 లక్షలు మంజూరైనట్టు పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకార కృషి చేస్తానని పేర్కొన్నారు అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని గ్రామ మౌలిక వసతులు కల్పనకు తన వంతు సహాయ సహకార చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సునీల్ రెడ్డి మాజీ సర్పంచ్ బండి రమణ గౌడ్ నాయకులు లక్ష్మణ్ పటేల్ గుద్దేటి నర్సయ్య నవీన్ ప్రశాంత్ ప్రతాప్ రెడ్డి మక్బూల్ దత్తు పురుషోత్తం స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
