మాజీ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం..

మాజీ మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం..
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావును ఆ సంఘం ప్రతినిధులు బుధవారం కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. గొర్రెలు, మేకల కాపరుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారాన్ని అందించాలని, అసెంబ్లీలో సమస్యలను ప్రస్తావించాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. హరీష్ రావును కలిసిన వారిలో రాష్ట్ర బాధ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు దేశ బోయిన సూర్యనారాయణ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు జల్లి నర్సింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సోము రమేష్ కురుమ తదితరులు ఉన్నారు.
