బూర్గంపాడు పంచాయతీలో నిధులు గోల్ మాల్ …

బూర్గంపాడు పంచాయతీలో నిధులు గోల్ మాల్ …
కలెక్టర్ అంకిత్ కు మాజీ ఉపఉపసర్పంచ్ ఫిర్యాదు..
రికార్డులు లేకుండా లక్షల్లో ఖర్చు చేశారంటూ ఆరోపణ…
విచారణకు ఆదేశించిన కలెక్టర్…
బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామపంచాయతీలో నిధులు వినియోగంలో అవకతవకలు జరిగే అంటూ సోమవారం జిల్లా కలెక్టర్ లో ఫిర్యాదు నమోదయింది. బూర్గంపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నిధులు దారి మళ్ళించారని బూర్గంపాడు మాజీ ఉపసర్పంచ్ చిప్పా సుధాకర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో చిప్ప సుధాకర్ స్వయంగా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. గత సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత వెంటనే ఎన్నికలు నియమించకపోవడంతో పంచాయతీ పాలన ప్రత్యేక అధికారులు చేతుల్లోకి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకొని భారీగా నిధులు ఖర్చు చేసినట్లు కార్యదర్శి రికార్డులో చూపించారని ఆయన ఆరోపించారు. గ్రామపంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోయినా జరిగినట్లుగా చూపిస్తూ లక్షల రూపాయలు నిధులు ఖర్చు చేసామని చూపించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఎంబి రికార్డులు లేకుండానే లక్షల బకాయిలు ఉన్నట్లు రికార్డు చూపించటం ఆశ్చర్యం కలిగించింది. లెక్కలు వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆయన పేర్కొన్నారు.

విచారణ కలెక్టర్ ఆ దేశం..
ఈ ఫిర్యాదు పై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించినట్లు సమాచారం. పంచాయతీ నిధులు వినియోగంలో అక్రమాలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. రికార్డు లేకుండా ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేయడం చట్ట విరుద్ధమని దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజ నిజాలు బయటపెట్టాలని మాజీ ఉపసర్పంచ్ చిప్పా సుధాకర్ కలెక్టర్ అంకిత్ కి విన్నవించుకున్నారు. జిల్లా అధికారి ఆదేశాలతో విచారణ జరిగితే బూర్గంపాడు పంచాయతీలో అసలు ఏం జరుగుతున్నదని విషయం వెలుగులోకి రానున్నాయి…
