ప్రతిమ ఫౌండేషన్ సహకారం తో జాబ్ మేళా..

ప్రతిమ ఫౌండేషన్ సహకారం తో జాబ్ మేళా..

సిర్పూర్ (యు ) ఆంధ్రప్రభ : కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని పంగిడి గ్రామంలో ని రైతు వేదికలోసర్పంచ్ ఆత్రం మీరా జాలింషా ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ వారి సహకారం తో ఈనెల 23న మధ్యాహ్నం 2- 30 గంటలకు నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణా తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల మేళ నిర్వహిస్తున్నట్లు పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా తెలిపారు. ఈ జాబ్ మేళా లో బెడ్ సైడ్ నర్సింగ్ (అమ్మాయిలకు )డెమోస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్అ మ్మాయిలకు టైలరింగ్ఎలక్ట్రీషియన్(అబ్బాయిలకు )సోలార్(అబ్బాయిలకు )ఏసీటెక్నీషియన్(అబ్బాయిలకు )బ్యాంకింగ్(అబ్బాయిలకు,అమ్మాయిలకు )జాబ్స్ లలోట్రైనింగ్ఇచ్చేసిఉద్యోగం కల్పించబడ0 జరుగుతుందని సర్పంచ్తెలిపారు.ఈఉద్యోగాలకుటెన్త్,ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ జాబ్ మేళాకు అర్హులైన సిర్పూర్ (యు) లింగాపూర్, జైనూర్ మండలాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని పంగడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింశావ్ కోరారు. ఈ సందర్భంగా జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్, సత్యవర్ధన్, బావురావు, యువకులు, గ్రామస్తులు పాల్గున్నారు.

Leave a Reply