గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత..

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత..
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
మండలంలో 2 కోట్ల 50 లక్షల సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన
నెక్కొండ, ఆంధ్రప్రభ : గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులను కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం నెక్కొండ మండల కేంద్రంలోని రాజీవ్ నగర్, నందమూరి నగర్ తో పాటు చంద్రుగొండ, దీక్షకుంట్ల, అప్పలరావుపేట, తోపనపల్లి, అలంకానిపేట, నాగారం గ్రామాల్లో రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో చేపడుతున్న నూతన సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎస్సీ సప్లండ్ నిధుల నుంచి నూతన సిసి రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దళిత గిరిజన వాడలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విడుదల వారీగా అమలు చేస్తుందన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత పూర్తి అయ్యాయని త్వరలోనే రెండో విడత ఇండ్లను లబ్ధిదారులకు ఇస్తామన్నారు. పలు గ్రామాల్లో కుల సంఘాల భవనాల నిర్మాణాలకు మంజూరు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, ఉపసర్పంచ్ సింగం శ్రావణిప్రశాంత్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, లావుడ్య తిరుమల్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చల్ల శ్రీపాల్ రెడ్డి, కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, చల్ల రగోత్తంరెడ్డి, కొణిజేటి బిక్షపతి, షేక్ షబ్బీర్, బండి శివకుమార్, చంద్రుగొండ సర్పంచ్ బక్కి కవిత, అప్పలరావుపేట సర్పంచ్ ఉడుగుల అశోక్, అలంకానిపేట సర్పంచ్ రాంపల్లి నిరోషాశ్రవణ్ కుమార్, దీక్షకుంట్ల, నాగారం, తోపనపల్లి గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
చెక్ డాం ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పరిశీలన…. నెక్కొండ మండలంలోని నక్కలగుట్ట తండా నాగారం గ్రామాల మధ్య వట్టే వాగుపై నిర్మిస్తున్న చెక్ డాం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలించారు. వేసవి కాలంలో పనులు పూర్తి చేయాలని వర్షాకాలం నాటికి బ్రిడ్జిపై నుండి రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
