కల్వర్టు పనులు ప్రారంభించిన సర్పంచ్..

కల్వర్టు పనులు ప్రారంభించిన సర్పంచ్..
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామం లోని 8వ వార్డ్ లో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ చేతుల మీదుగా పూజలు నిర్వహించి అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు.ఈసందర్భంగా 8వ వార్డులో నూతనంగా నిర్మించే కల్వర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తక్కురి ముత్యం,టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్,గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్,యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు నరేందర్,వార్డ్ సభ్యులు సాదుల్లా, అంజిత్, సురేష్, అనిల్,సంతోష్,సతీష్,అజయ్ గౌడ్ ,వెంకట్,నాయకులు క్రాంతి నజీర్,ఉబేద్ కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
