సీసీ రోడ్లకు రూ.1.55 కోట్ల మంజూరు..

సీసీ రోడ్లకు రూ.1.55 కోట్ల మంజూరు..

బిజెపి రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ నియోజకవర్గం లోని నర్వ, ఉట్కూర్,మక్తల్,మాగనూర్, కృష్ణా మండలాలకు ఎంజీ ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా సీసీ రోడ్లు నిర్మాణానికి అడిగిన వెంటనే రూ.1,55 కోట్లు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే. అరుణమ్మ మంజూరు చేసినట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేసిన అరుణమ్మ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పనులను ఈనెల 25 నాటికి పూర్తి చేయించాలని ఆయన సూచించారు.పూర్తయిన సీసీ రోడ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులకు మహబూబ్నగర్ ఎంపీ డీకే. అరుణమ్మ ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. మండలంలో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మక్తల్ నియోజక వర్గంలోని ఏడు మండలాలకు కలిపి సీసీ రోడ్లు వేయడానికి రెండు కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసిన అరుణమ్మను కలుసుకుని బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply