యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

తొర్రూరు, ఆంధ్రప్రభ : యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బిజెపి అర్బన్ మండల అధ్యక్షుడు పైండ్ల రాజేష్ అన్నారు.బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగ యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అర్హులైన యువతకు నిరుద్యోగ భృతి కల్పించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని దీనికోసం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేసి ఖాళీగా ఉన్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని,అలాగే వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు కొత్త పెన్సషన్లు వెంటనే చెల్లించాలని, స్థానికంగా నిర్లక్ష్యానికి గురైన 100 పడకల హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మొన్నటి వరకు మున్సిపాలిటీ ఎన్నికలలో హామీల వర్షం కురిపించి గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు అందించాలని డిమాండ్ చేశారు. పేరుకపోయిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కార్యదర్శి మాజీ కౌన్సిలర్ కొలుపుల శంకర్,తొర్రూరు రూరల్ అధ్యక్షుడు గట్టు రాంబాబు, రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రచ్చ కుమార్, జిల్లా నాయకులు అలిసేరి రవిబాబు, మంగళపల్లి యాకన్న, చల్వాయి సత్యనారాయణ, అర్బన్ ప్రధాన కార్యదర్శిలు పప్పు శెట్టి సంతోష్ కుమార్, నడిగడ్డ సందీప్,తూర్పాటి సాయి ముఖేష్, జలగం రవి,గుండా సురేష్, మూల శేఖర్, నర్కుటి చలపతి రాజ్, గట్ల భరత్,ధరావత్ తేజస్, నాయక్, కాగు నవీన్, నూకల నవీన్,తూర్పాటి మోహిత్, వినుకొండ అనిల్, తూర్పాటి సాకేత్, రవి నాయక్,తాటిశెట్టి నవీన్, జాటోత్ నరేందర్,నరేష్ ,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply