చిరుతను చంపిన కేసులో నిందితులకు రిమాండ్..

చిరుతను చంపిన కేసులో నిందితులకు రిమాండ్..

దండేపల్లి, ఆంధ్రప్రభ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధిలోని ఊట్ల అటవీ ప్రాంతంలో ఇటీవల వేటగాళ్ల ఉచ్చుకి బలైన చిరుతపులి కేసులో ముగ్గురు నిందితులను అటవీశాఖ అధికారులు రిమాండ్​ చేశారు. చిరుతను వాహన బైక్ క్లచ్ వైర్లతో ఉచ్చు వేసి చంపి గోర్లతో పాటు ఇతర అవయవాలు తీసుకున్న ఘటనలో ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తాళ్ల పేట రేంజ్ ఆఫీసర్ సుస్మారావు తెలిపారు .నిందితులు దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన మోడితే వెంకటేష్, మోడితే శ్రీనివాస్, వనపర్తి శ్రీకాంత్ లను సోమవారం లక్షెటిపేట కోర్టులో హజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగాఆమె మాట్లాడుతూ వన్యప్రాణులకు హాని కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పోచమల్లు, బీట్ ఆఫీసర్లు నహేరా, సాయికుమార్,కృష్ణ తదితరులు ఉన్నారు.

Leave a Reply