పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..

పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..
హాల్ టికెట్స్ ఇవ్వని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాధల్లా శరత్
కరిమాబాద్, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పరీక్ష సమయంలో విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వని స్కూల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి శరత్. అన్నారు. గురువారం ఏఐఎస్ఎఫ్ కార్యాలయం శివనగర్ తమ్మెర భవన్ సమావేశంలో శరత్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.
పదవ తరగతి పరీక్షలకు వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, పరీక్ష కేంద్రంలో మాస్ కాపింగ్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పరీక్ష కేంద్రాల దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షసమయంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వని ప్రైవేట్ స్కూల్ పై యజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా లో ఉన్న పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అలాగే వేసవికాలం కావడంతో విద్యార్థులకు త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లు విద్యార్థులు 10 నిమిషాల లేటుగా వచ్చిన అనుమతించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి భరత్ శ్రేయాస్ రావితేజ చందు పాల్గొన్నారు.
