రైతు సంక్షేమానికి కృషి చేయాలి..

రైతు సంక్షేమానికి కృషి చేయాలి..

మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, ఆంధ్రప్రభ : నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలనీ మంత్రి వివేక్ అన్నారు. ఇవ్వాళ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం కొలువుదిరింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి వివేక్ హాజరైరు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన పని చేస్తుందని ప్రభుత్వం ఏర్పాటు కాగానే 23వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు.అనంతరం నూతన మార్కెట్ కమిటీ చేర్మెన్ మహేష్ ప్రసాద్ తివారి తో పాటు సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి మైనార్టీల కు రంజాన్ కానుకలను అందజేశారు.

Leave a Reply