ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన సర్పంచ్..

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన సర్పంచ్..
చిట్యాల, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి కాటం వెంకటేశం ను గెలిస్తే గ్రామంలో ఆడబిడ్డ పెళ్లి అయితే పదివేల 16 రూపాయలు అందిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో శ్రీ శ్రీ శ్రీ తిరుమల నాద దేవస్థానం చైర్మన్ ఓర్సు రాజు ప్రకటించడం జరిగింది, అందులో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ వర్గం చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామం లో సోమవారం నాడు గ్రామానికి చెందిన నూతి శ్రీను కుమార్తె జ్ఞానేశ్వరి వివాహం జరిగింది నూతన దంపతులకు చైర్మన్ పంపిన పదివేల 16 రూపాయల ను మండల సర్పంచ్ల ఫోరం గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు వార్డు సభ్యులు కురు యాదయ్య ఎరుపుల నరసింహ ఆమనగంటి నరేష్ నూతి వెంకటేశం కట్ట పుల్లారెడ్డి తదితరు పాల్గొన్నారు
