నాణ్యత పాటించాలి..

నాణ్యత పాటించాలి..

భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సర్పంచ్

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : గ్రామైక్య సంఘ భవన నిర్మాణంలో నాణ్యత పాటించాలని సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా అన్నారు. ఆమె సోమవారం పంగిడి గ్రామంలో పది లక్షలతో నిర్మిస్తున్న సమైక్య భవన పనులను పరిశీలించారు. ఈ భవన పనులు త్వరగా పూర్తిచేయాలని భవన పనులు పూర్తయితే గ్రామైక్య సంఘాల మహిళలకు సమావేశాలు నిర్వహించుటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సమైక్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి, ఐకెపిసిసి తుకారం వివోఏ విశ్వనాథ్, నాయకులు ఆత్రం జాలింషా, కిషన్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply