TG | కాంగ్రెస్‌ది కీలక పాత్ర

TG | కాంగ్రెస్‌ది కీలక పాత్ర
- స్వాతంత్ర్య సమరం, దేశ అభివృద్ధిలో తనదైన ముద్ర
TG|మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు బోయ రవికుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ… వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రంలో కీలక భూమిక పోషించిందని అన్నారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత దేశ అభివృద్ధిలో సైతం కాంగ్రెస్ తనదైన ముద్రవేసిందని కొనియాడారు.
రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందని, మక్తల్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైందన్నారు. ఇందుకు కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మండల అధ్యక్షులు బి.గణేష్ కుమార్, నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, కోళ్ళ వెంకటేష్, కట్ట వెంకటేష్, మందుల నరేందర్, కున్సీ నాగేందర్, బోయ వెంకటేష్, రాయికోడ్ ఆనంద్, గోలపల్లి నారాయణ, మెదరి శ్రీనివాసులు, అబ్దుల్ రెహమాన్, కావలి తాయప్ప, నూరుద్దీన్, విష్ణు, ఉసాముద్దీన్, రహీం పటేల్, పంచ లింగాల నాగేష్, బోయ నర్సింహ్మ, మెకానిక్ రాము, బాలచందర్, మిస్కిన్ నాగరాజ్, వడ్డే బాలరాజ్, గుంతలి శివకుమార్, కొండయ్య, మొగులప్ప, సురేష్, గడుగు వెంకటేష్, నాగేశ్వరరావు, చందాపురం రాములు, తిరుమలాపురం నర్సింహ్మ, మహేష్, నూరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
