హెచ్ పి వి టీకా కార్యక్రమం..

హెచ్ పి వి టీకా కార్యక్రమం..

బాలికలకు టీకాలు వేస్తున్న వైద్యులు
హెచ్ పి వి టీకా బాలికల ఆరోగ్య భద్రతకు దోహదపడుతుంది
టీకా వేసే కార్యక్రమం ప్రారంభం
మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకా బాలికల ఆరోగ్య భద్రతకు దోహదపడుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ సామజిక ఆరోగ్య కేంద్రం లో డా. చింతకింది కాటం రాజు పర్యవేక్షణలో బాలికలకు గర్భాశయ కాన్సర్ నివారణ (హెచ్ పి వి) టీకా కార్యక్రమం (హ్యూమన్ పంపిల్లొమా వైరస్ వాక్సినేషన్ లాంచింగ్ ప్రోగ్రామ్) ను డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. లక్ష్మీపురం యశోద తో కలిసి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్ పి వి టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఎంత ముఖ్యమో వివరించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, బాలికలు, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలిపారు.

ఆరోగ్యమైన బాలికలు – శక్తివంతమైన మహిళలు – అభివృద్ధి చెందిన సమాజం” అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, భవిష్యత్ తరాలను రక్షించేందుకు ఈ కార్యక్రమం ఒక గొప్ప అడుగు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం సమాజంలో అవగాహన పెంచి, బాలికల ఆరోగ్య భద్రతకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ ఎండి హన్ను, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొగుదాల రమేష్ గౌడ్, స్థానిక నాయకులు, గైనకాలజిస్ట్ డా. విజయలక్ష్మి, పీడియాట్రిక్ డా. అజీమా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply