మా ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ను ఇవ్వండి…

మా ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ను ఇవ్వండి…

డాక్టర్ కొరతతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది…
ఉన్నత చదువులకు వెళ్లిన డాక్టర్ సాహితి…
కొత్త డాక్టర్ కోసం ఎదురుచూపులు..
నియామకం ఆలస్యం తో
ఇబ్బందులు పడుతున్న స్టాఫ్ నర్స్ లు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, ఆంధ్రప్రభ ; మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్ నియామకం ఇవ్వండి కలెక్టర్ గారు అంటూ భూర్గంపాడు మండల ప్రజలు వేడుకుంటున్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న డాక్టర్ సాహితి ఉన్నత చదువుల నిమిత్తం గత వారం రోజుల క్రితం వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో కొత్త డాక్టర్ నియామకం ఆలస్యం కావడంతో ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయి వైద్య సేవలు కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిత్యం ఓపి గణనీయంగా ఉండి ఫ్రీ డెలివరీకి కేంద్రంగా ఉంటుందని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి సబ్ సెంటర్లు ఉన్న రోగులు ప్రతిరోజు ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యురాలు చేత వైద్యం పొంది వెళ్తూ ఉంటారు. ఆసుపత్రిలో డాక్టరు లేకపోవడంతో ఉన్నటువంటి స్టాప్ నర్సులు తోనే వైద్య సేవలు అందించడం జరుగుతుంది.

వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న సిబ్బంది..

ఉన్నత చదువుల నిమిత్తం ఇటీవల వెళ్ళిన డాక్టర్ సాహితీ ఆమె ప్లేస్ లో ఎవరు మరొక డాక్టర్ రాకపోవడంతో ఆసుపత్రిలో డెలివరీ, ప్రమాదపు కేసులు , పలురకాల రోగులు వైద్యం కోసం వచ్చినప్పుడు డాక్టర్ లేకపోవడంతో వారితో పాటు వచ్చిన వారు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని పలు నోటి మాటలతో దుర్భసులాడుతున్నారని తాము వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వారి మాటలు వలన ఇబ్బంది పడి ఉద్యోగం చేయాల్సి వస్తుందని మనోవేదన పడుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఆసుపత్రి ఉండడం అందులో 24 గంటలు వైద్య సేవలు అందించే ఆసుపత్రి కావడంతో తరచూ రాత్రి సమయంలో పలు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి వైద్యశాల అందించడంలో స్టాఫ్ నర్సులు డాక్టర్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని లోలోన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అవమానాలు ఎదుర్కొంటున్నారు.

నిత్యం 100కు పైగా ఓపి పేషెంట్లు వైద్య సేవలు కోసం వస్తున్న ఈ ఆసుపత్రి డాక్టర్ రిలీవ్ అయిన వెంటనే మరొక డాక్టర్ రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని మరికొందరు సిబ్బంది మధన పడుతున్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రడు వెంట ఎవరూ రాకపోవడంతో ప్రాథమిక వైద్యం అందించిన స్టాఫ్ నర్సులు వెంటనే 108 కి సమాచారం అందించి మెరుగైన వైద్యం అందించాలని సంకల్పంతో 108 కి ఫోన్ చేసిన సమయంలో కూడా పేషెంట్ వెనక ఎవరూ రాకపోతే తీసుకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాత్రి సమయంలో మద్యం మత్తులో కొందరు వచ్చి తమకు వైద్యం అందించాలని ఘర్షణలకు సైతం దిగుతున్నట్లు సెక్యూరిటీ గార్డు లేక నాన్న ఇబ్బందులు గురవుతున్నట్లు స్టాఫ్ నర్సులు వాపోతున్నారు.

గ్రామస్తుల సహకారంతోనే కొంతమేర మందు ప్రియుల నుండి తాము తప్పించుకొని వైద్య సేవలు అందించడం జరుగుతుందని అయినప్పటికీ వెంటనే సెక్యూరిటీ గార్డును కూడా అందించాలని కోరుతున్నారు.నూతన బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ గారు వెంటనే తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్ డాక్టర్ను నియమించగలరని మండల ప్రజలతో పాటు, రోగులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.

Leave a Reply