అంగన్ వాడి కేంద్రంలో అన్నప్రాసన

అంగన్ వాడి కేంద్రంలో అన్నప్రాసన
మునుగోడు, మార్చి 6 (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెం అంగన్ వాడి కేంద్రంలో ఈ రోజు చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అన్నప్రాసనం చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పాలకూరి రమాదేవి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు అంగన్వాడి కేంద్రాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ విక్టోరియా,గ్రామ మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
