సొంతింటి కల నెరవేరింది..

సొంతింటి కల నెరవేరింది..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరిందని ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యజ్ఞేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు సొంతింటి కల నెరవేర్చుకొని సంతోషంగా నూతన గృహ ప్రవేశాలు చేస్తున్నారని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి బిల్లులు ఆలస్యం చేయకుండా దశల వారీగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తుండడంతో సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల కళ్ళల్లో సంతోషం చూస్తున్నామని అన్నారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగా మంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగేష్ గౌడ్, డాక్టర్ రఘు, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ, బండి నరేష్, అర్ఫత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply