రోడ్డుపై ధర్నా చేస్తున్న డిగ్రీ విద్యార్థినీలు

రోడ్డుపై ధర్నా చేస్తున్న డిగ్రీ విద్యార్థినీలు

సముదాయిస్తున్న ఆర్ సి ఓ అగస్టీన్
అధ్యాపకురాలు వైఖరికి నిరసనగా రోడ్డు ఎక్కిన విద్యార్థినిలు
అధ్యాపకురాలను తొలగించాలని నినాదాలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కేబి కాంప్లెక్స్ లో గల గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల లో పనిచేస్తున్న ఆంగ్ల అధ్యాపకురాలు ప్రత్యూష ఇష్టం వచ్చినట్లు విద్యార్థినీలకు బూతు మాటలు తిడుతుందని, మనస్థాపానికి గురి చేస్తుందని, హింసిస్తుందని ఆమె వైఖరి పై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థినిలు పి ఎం ఆర్ సి భవనం ముందు రోడ్డెక్కి రోడ్డుపై ఎండలో ధర్నా నిర్వహించారు. అధ్యాపకురాలు ప్రత్యుష పై చర్యలు తీసుకొని ఈ కళాశాల నుండి బదిలీ చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థినిలు చేస్తున్న ధర్నా విషయాన్ని తెలుసుకున్న ఆర్ సి ఓ అగస్టీన్,ఏసీఎంవో జగన్, పివిటిసి ఏపీవో ఆత్రం భాస్కర్ ఏ టి డబ్ల్యూ, ఉట్నూర్ ఎస్సై విజయ్ కుమార్ వచ్చి విద్యార్థినిలతో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నారు.

అధ్యాపకురాలపై చర్యలు తీసుకోవాలని పిఓ కు నివేదిక ఇస్తామని అధికారులు హామీ ఇచ్చిన విద్యార్థినిలు శషమేర అంటూ అన్నం తినకుండా ఎండలో ధర్నా కి నిరసనలు వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో వచ్చి హామీ ఇచ్చేవరకు తాము భోజనం చేయమని ధర్నా విరమించమని పట్టుబట్టారు దీంతో చివరకు ఏపీవో ఆ త్రం భాస్కర్, ఎస్సై విజయ్ అధికారులు నమ్మకమైన ఇస్తూ అధ్యాపకురాలు ప్రత్యూష ను ఈ కళాశాల నుండి పంపిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినీలు ధర్నా విరమించారు. అధ్యాపకురాలు చాలా రోజుల నుండి విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతూ ఇలాగే వ్యవహరించిన ప్రిన్సిపాల్ కూడా పట్టి పట్టినట్లు వ్యవహరించాలని విద్యార్థినీలు అధికారుల, విలేకరులతో తెలిపారు. అధికారులు ఆమెపై చర్యలు తీసుకోకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని తమకు న్యాయం జరిగే వరకు తమకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న అధ్యాపకురాలు ను ఈ కళాశాల నుండి బదిలీ చేయాలని విద్యార్థినిలు అధికారులకు కోరారు.

Leave a Reply