విద్యార్థులే ఉపాధ్యాయులైనవేళ…

విద్యార్థులే ఉపాధ్యాయులైనవేళ…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం వివిధ వేషాధారణలో తోటి విద్యార్థులకు విద్యాబోధనలు చేపట్టి స్వయం పరిపాలనదినోత్సవంవేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్వయం పరిపాలన దినోత్సవం పురస్కరించుకుని సర్పంచ్ అంజయ్య, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, అశోక్, వెంకటయ్య, సుధాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, చెన్నారెడ్డి, గ్రామ పెద్దలు యువకులు తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించి బోధన తీరును పరిశీలించి అభినందించారు.

అనంతరం పాఠశాల హెచ్ఎం ఆర్.కిషోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య వక్తగా మక్తల్ ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ నర్సిములు హాజరై మాట్లాడుతూ ప్రాధాన్యతను, పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించేందుకు మెలుకువలు విద్యా రుణాలు పొందే అవకాశాల గురించి వివరించారు. చక్కగా విద్యా బోధనలు చేపట్టిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. స్వపరిపాలన దినోత్సవం వేడుకల్లో భాగంగా కలెక్టర్ గా నాగేశ్వరి, డీఈవో గా ఆకాష్, ఎంఈవో గాపావని,హెచ్ఎం గా బి అనిత, ఉపాధ్యాయులుగా పవిత్ర కల్పన ,వైష్ణవి ,కావేరి ,నరేష్, నవదీప్, లక్ష్మి ,ప్రణీత, జస్వంత్ ,గణేష్, రాజేశ్వరి , మురళి, నవీన్, అర్చన, ఎస్ కల్పన, మైను వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్ పర్సన్ పద్మమ్మ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఉపాధ్యాయ బృందం మహేష్ కుమార్, రమేష్ ,గోపాల్ ,నాగరాజు, గజలప్ప, మనోహర్, హర్షద్ ,నరేష్ ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply