ప్లాస్టిక్ రహిత బెల్లంపల్లిగా అభివృద్ధి చేస్తాం…

ప్లాస్టిక్ రహిత బెల్లంపల్లిగా అభివృద్ధి చేస్తాం…
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా అభివృద్ధిపరిచేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారం తో పాటు , కాంగ్రెస్ సీనియర్ నాయకుల, ప్రజల అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామని మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్ బాబు అన్నారు.ఆదివారం రాత్రి బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, వైస్ చైర్మన్ రాగంశెట్టి సతీష్, మున్సిపల్ కౌన్సిలర్లకు ఆదివారం రాత్రి వంజరి రాజేశం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానకార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహాయ సహకారాలతో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో బెల్లంపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రాణాళిలా బద్ధంగా కృషి చేస్తామని చైర్పర్సన్ ప్రకటించారు. బెల్లంపల్లి పట్టణంలో కొత్త గా ఇళ్ళు నిర్మించుకుంటున్న వారికి కొత్త ఇంటి నెంబర్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ద్వారాప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా తగు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ సతీష్ మాట్లాడుతూ నిస్వార్ధంగా ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ నాయకత్వాన్ని బెల్లంపల్లిలో ముందుకు తీసుకు వెళ్ళేందుకు కట్టుబడి ఉన్నామని ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు ఇవ్వమని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జీడ్పి టీ సీ కార్కూరిరాంచందర్, టీ పీ సీ సీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి మున్సిపల్ కౌన్సిలర్లు చింతల వసంత, మేడి పున్నంచందర్,నీలి హారిక, బేతి శ్రావణ్, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు ఎర్ర ఆదర్స్ వర్ధన్ రాజు, పెద్ద బుగ్గ ఆలయ కమిటీ చైర్మన్ మహేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఢీకొండ రాజలింగు, గాలి శ్రీనివాస్ యాదవ్, దామెర శ్రీనివాస్, పోచంపల్లి హరీష్ పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు వంజరి రాజేశం కుటుంబీకులు పాల్గొన్నారు.
