TG | పరకాల పొలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సిపి

TG | పరకాల పొలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సిపి
TG | పరకాల, ఆంధ్రప్రభ : మున్సిపల్ నేపథ్యంలో పరకాల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పరకాల మండల కేంద్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పొలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్బంగా పోలింగ్ సామగ్రి పంపిణీ జరుగుతున్న తీరుపై పోలీస్ సంబంధిత అధికారులను వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఇదే కళాశాలలో ఏర్పాటు ఎన్నిక లెక్కింపు కేంద్రాలతో పాటు, బ్యాలేట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను పోలీస్ కమిషనర్ అడిషినల్ కలెక్టర్ రవితో కలసి పరిశీలించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లపై పోలీస్ సంబంధిత రెవేన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. లెక్కింపు సజావుగా కోనసాగేందుకు తీసుకోవాల్సిన ముందస్తూ జాగ్రత్త చర్యలపై పోలీస్ కమిషనర్ పరకాల ఏసిపి సతీస్ బాబుకు అదేశాలు జారీచేసారు. అదే విధంగా బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చే స్ట్రాంగ్ రూంలను సైతం పోలీస్ కమిషనర్ పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు జరిగే ఎన్నికలను సజావుగా, ప్రశాంతవంతమైన వాతవరణం నిర్వహించేందుకుగా అధికారులందరు సన్నద్దం కావాలని, ఎవరైన ఎన్నికల నియమాలను అత్రికమించకుండా జాగ్రత్త పడాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను అదేశించారు. పోలీస్ కమిషనర్ వెంట పరకాల ఆర్డీఓ డాక్టర్ నారయణ, ఏసిపి నాగయ్య, ఇన్స్‌స్పెక్టర్లు వి క్రాంతి కుమార్, రంజిత్ కుమార్, ఎస్.ఐ అశోక్ కూమార్‌తోపాటు పోలీస్ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
