TG | బావిలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి..

TG | బావిలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి..

TG | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్కూరు మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన అంపెళ్లి మోహన్ కూతురు అంపెల్లి సోని 17 ఇంటర్ విద్యార్థిని బావిలో పడి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలిపారు. మృతురాలు సోని నాన్నూర్ లోని మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ అవుతుందని తెల్లవారుజామున తాగునీటి బావి వద్ద నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు తెలిసింది. మృతురాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి పంచనామా చేసి సోనీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

TG

Leave a Reply