TG | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

TG | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

TG |మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గంగోరిగూడెం గ్రామానికి చెందిన శవగోని వెంకటమ్మ నరసింహకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.17, 500/- ల చెక్ మంజూరైంది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సిఫారసుతో మంజూరైన చెక్‌ను బిఆర్‌ఎస్ మండల నాయకులు కొంపల్లి కిరణ్ గౌడ్, జనగాం వెంకన్న గౌడ్‌లు బీఆర్‌ఎస్ గ్రామ శాఖ నాయకులతో కలిసి లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు బిఆర్‌ఎస్ పార్టీ ముందుండి ఆదుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు పార్టీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ గ్రామ శాఖ నాయకులు వీరమళ్ళ ఈశ్వరయ్య గౌడ్, ఏనుగు నర్సిరెడ్డి, గోపగొని సైదులు గౌడ్, జనగాం జగతయ్య గౌడ్, గోపగొని అమరేందర్ గౌడ్,యూత్ అధ్యక్షుడు గోపగొని దిలీప్ గౌడ్,గోపగొని వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply