TG | భోగిమంటల వేడుకలు

TG | భోగిమంటల వేడుకలు

TG | కరీమాబాద్, ఆంధ్రప్రభ : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనగర్లోని లిటిల్ ఫ్లవర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగిమంటల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం యూత్ అసోసియేషన్ సభ్యులు చక్కగా శివనగర్లో భోగిమంటలు వేసి డీజే లు పెట్టి అహల్లాదకరమైన నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం శివనగర్ అధ్యక్షుడు మంచాల కృష్ణమూర్తి మాట్లాడుతూ… సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేందుకు భోగిమంటలు సంక్రాంతి ముగ్గులు వేయడం జరుగుతుందని భవిష్యత్ తరాలకు సంక్రాంతి పండగ పర్వదినం తెలియపరిచిన వారం అవుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ముంచాల కృష్ణమూర్తి, బజ్జూరీ అంజయ్య, లిటిల్ ఫ్లవర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply