TG | రామచంద్రాపూర్ ఆలయానికి విరాళం అందజేత …

TG | రామచంద్రాపూర్ ఆలయానికి విరాళం అందజేత …

TG | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : జనగామ నియోజకవర్గ బచ్చన్నపేట మండలంలోని రామచంద్రపురం గ్రామంలో శ్రీ శివ సీతారామాంజనేయ దేవాలయం పునర్నిర్మాణంలో కుడికాల రవి, మిత్రులు హైదరాబాద్ వాస్తవ్యులైన పులకరం రూప, వంగర పద్మావతిలు శ్రీ శివ సీతారామాంజనేయ గుడి నిర్మాణం కోసం 44000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆలయ కమిటీ నిర్వాహకులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, సీతారామాంజనేయ కృప వారికి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ పుణః నిర్మాణానికి దాతలు మరింత ముందుకు రావాలని, ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు కోరుతున్నారు..

Leave a Reply