TG | బోల్తా పడిన ట్రాక్టర్..

TG | బోల్తా పడిన ట్రాక్టర్..
- 6గురు కూలీలకు తీవ్ర గాయాలు!
TG | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : మండలంలోని రోహిర్ సమీపంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. గుర్రాలబావికి చెందిన కూలీలు మిర్చి కోతకు ట్రాక్టర్‌లో వెళ్తుండగా, వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీల కాళ్లు విరగగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఏటూరునాగారం సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
