TG | బోర్ల గూడెంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

TG | బోర్ల గూడెంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
TG | మహా ముత్తారం, ఆంధ్రప్రభ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురి చేస్తూ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మహా ముత్తారం మండలంలోని బోర్ల గూడెం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బోర్లగూడెం చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాహనం చేశారు. దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. అనంతరం పోలీసులు వారిని చెదరగొట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రికీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ.పీ మెండ వెంకటస్వామి, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు జాటోద్ జైపాల్ నాయక్, వజనపల్లి సర్పంచ్ జాగరి మహేష్, నిమ్మగూడెం సర్పంచ్ జాడి రాజేష్, స్తంభంపల్లి పి పి సర్పంచ్ జాడి కీర్తన శ్రీనివాస్, జాటోద్ రూప నాయక్, బొబ్బిలి వెంకటయ్య, ఠాకూర్ శ్రీహర్ష, వాసంపల్లి మహేష్, వావిళ్ళ చంద్రయ్య, ఇనుముల మల్లేష్, వావిళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
టిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ఉండేందుకు ముందస్తుగా మహమూత్తారం పోలీసులు బీ ఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో బీఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు మార్క రాముగౌడ్ బోర్లగూడెం సర్పంచ్ ధరం సింగ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీపతి సురేష్ గౌడ్, అధ్యక్షుడు జాగరి మల్లేష్, యూత్ అధ్యక్షుడు రాజు, సంపత్, సాంబరాజు చంద్రయ్య, జంగాపల్లి వెంకటరాజంను అరెస్టు చేశారు. వీరిని అరెస్టు చేసినప్పటికీ బోర్లగూడెంలో మాత్రం టీఆర్ఎస్ నాయకులు పోలీసుల కళ్ళు కప్పి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
