TG | మిస్సింగ్ క్యాంపు సేవలు హర్ష నీయం

TG | మిస్సింగ్ క్యాంపు సేవలు హర్ష నీయం

TG | తాడ్వాయి, ఆంధ్రప్రభ : మేడారం మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మిస్సింగ్ క్యాంపు సేవలు భక్తులు మెచ్చుకునే విధంగా ఉన్నాయని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత తెలిపారు. జాతర లో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో భక్తులు తమ చిన్న పిల్లలను, వృద్దులను జాగ్రత్తగా చూసుకుంటూ అమ్మవార్లను దర్శించుకొని క్షేమంగా తమ తమ ఇళ్లకు చేరుకునే విధంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భక్తులు సౌకర్యార్థం జాతరలో 6 చోట్ల మిస్సింగ్ క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు. జంపన్న వాగు, జంపన్న వాగు సులాబ్ కాంప్లెక్స్, ఆర్ టీ సి బస్సు స్టాండ్, గ్రామపంచాయతీ వద్ద,చిలుకల గుట్ట రోడ్,గద్దెల వెలుపల వైపు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులు వారి వెంట వచ్చే వృద్ధులు, చిన్న పిల్లల చేతులపై ఫోన్ నెంబర్ రాసి ఉంచాలని ఎవరైన తప్పిపోతే వారిని గుర్తించడం సులువు అవుతుందని శిబిరం నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply