పదవ తరగతి పరీక్షలు షురూ

ములకలపల్లి, ఆంధ్రప్రభ : నేటినుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం ములకలపల్లి మండలంలో 301 మంది విద్యార్థులకు గాను రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పదవ తరగతి పరీక్ష కేంద్రానికి 301 మంది రావాల్సి ఉండగా 300 మంది మాత్రమే పరీక్ష రాయడానికి హాజరైనారు. పరీక్ష హలో విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేటినుంచి మొదలైన పరీక్షలు ఏప్రిల్ 16 వ తేది వరకు జరగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం. 12:30 వరకు పరీక్షల సమయం వుంటుంది. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలనె నిబంధనలు ఉండగా 5 నిమిషాలు గ్రేస్ సమయాన్ని ఇచ్చారు.
పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాస్ కాఫియింగ్ అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు సిట్టింగ్ స్కాడ్ తో పాటు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీల అనుమతి లేదు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులు తెలిపారు.
