Tenth exams | మార్చి 14 నుంచి -టె-న్త్‌ పరీక్షలు

Tenth exams | మార్చి 14 నుంచి -టె-న్త్‌ పరీక్షలు

Tenth exams | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో -టెన్త్‌ పరీక్షలు(Tenth exams) వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16వ తేదీ వరకూ జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల బోర్డు ప్రకటించింది. ఈ మేరకు -టె-న్త్‌ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది.

ఎస్‌ఎస్‌సీ, ఓపెన్‌ స్కూల్‌, వృత్తి విద్య విద్యార్థులకు ఈ -టైమ్‌ టేబుల్‌(time table) వర్తించనుంది. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరుగుతాయి. మార్చి 14న మొదటి భాషా పరీక్ష (తెలుగు, ఉర్ధూ), మార్చి 18న రెండో భాష (హిందీ), మార్చి 23న ఇంగ్లీషు, మార్చి 28న గణితం, ఏప్రిల్‌ 2న భౌతిక శాస్త్రం, ఏప్రిల్‌ 7న జీవ శాస్త్రం, ఏప్రిల్‌ 13న సామాజిక శాస్త్రం పరీక్షలు జరగనున్నాయి.

ఓపెన్‌ స్కూల్‌(open school) అభ్యర్థులకు సంబంధించిన ప్రధాన భాషా పేపర్‌-ఒ పరీక్ష ఏప్రిల్‌ 15న, పేపర్‌-ఒఒ పరీక్ష ఏప్రిల్‌ 16న నిర్వహించనున్నారు. వృత్తి విద్య థియరీ పరీక్ష కూడా ఏప్రిల్‌ 15న జరగనుంది.

Leave a Reply