ఈనెల 3వ తేదీ హోలీ పండగ సెలవు…

ఈనెల 3వ తేదీ హోలీ పండగ సెలవు…

4వ తేది యధావిధిగా టెన్త్ క్లాస్ గ్రాండ్ టెస్ట్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యజమాన్యములలోని ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం పోలీసులు నాలుగో తేదీ నుంచి మూడో తేదీకి మార్పు చేస్తున్నట్లు రాష్ట్ర విద్య శాఖ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులో జారీ చేశారు. వారు తెలిపిన ఆదేశాల మేరకు అకాడమిక్ క్యాలండర్ 2025-26 ప్రకారము “హోళీ” సెలవు ఈ నెల 4 వ తేది న ప్రకటించడమైనదన్నారు.

కాని డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ సీ నెం ఈ ఎస్ ఈ 02-11021/56/2025 ప్రకారం “హోళీ” సెలవు ను ఈ నెల 3 వ తేది కి కు మార్చడం జరిగినదన్నారు.కావున పాఠశాలలు “హోళీ” పండుగ సందర్భంగా 3 వ తేది మంగళవారం రోజు సెలవుగా ప్రకటించడమైనదని ఆ ఉత్తర్వు లో పేర్కొన్నారు. కావున ఈ నెల 4వ తేదిన పదవ తరగతికి గ్రాండ్ టెస్ట్, 9వ తరగతి ఎస్ ఏ 2 పరీక్షలుయధావిధిగా నిర్వహించి పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించించారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఉన్నత ఏ డేట్ మోడల్ స్కూల్ లలో పదవ తరగతి విద్యార్థులకు 100 డేస్ యాక్షన్ ప్లాన్‌కు సంబంధించి 3వ తేదీన జరగవలసిన రెమెడియల్ సెషన్ ను వ తేదికి మార్చడం జరిగిందన్నారు. మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఈ మార్పును గమనించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆదేంచారు. రాష్ట్రమంతటా ఈ ఉత్తర్వులను పాటించవలసిందిగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply