కాబూల్ పాకిస్థాన్ లోని బలూచ్ వేర్పాటు వాదులు నేడు ఓ ట్రైన్ ను హైజాక్ చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద సాయధులు దాదాపు 400 మంది ప్రయాణికులున్న ప్యాసింజర్ రైలుపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. లోకో ఫైలట్ ను గాయపరిచిన సాయుధులు.. రైలును పూర్తిగా వారి అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా ఆరుగులు సైనిక సిబ్బంది మృత్యువత పడగా.. సాయుధులైన బలూచ్ ఉగ్రవాదుల చేతిలో దాదాపు 140 మందికి పైగా జవాన్లను బందీలుగా పట్టుకుంది.. సాధారణ పౌరులను, పిల్లలను వదిలివేసింది.
పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ను లక్ష్యంగా చేసుకున్న బలూచ్ ఆర్మీ.. ట్రైన్ పై కాల్పులకు పాల్పడినట్లు పాకిస్థాన్ రైల్వే వెల్లడించింది. ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని కోరుతున్న ఉగ్రవాద వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. చాన్నాళ్లుగా ఈ ప్రాంతంలో పాక్ అధికారులు, సైన్యంపై విరుచుకుపడుతోంది. వీలు చిక్కినప్పుడల్లా దాడులు చేస్తూ.. భీభత్సం చేస్తోంది.
ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న రైలులో పాక్ సైన్యానికి చెందిన సిబ్బంది, ఇతర భద్రతా సంస్థల సభ్యులున్నారు. హైజాక్ వార్త తెలిసిన వెంటనే పాక్ సైన్యం స్పందించింది.. రైలు ఉన్న ప్రాంతానికి పెద్ద సంఖ్యలో సైన్యాన్ని పంపింది.. అదేవిధంగా హైజాక్ చేసిన వారితో చర్చలు ప్రారంబించింది.. బందీలను వెంటనే విడిచిపెట్టాలని, అలాగే వేర్పాటు వాదులు లొంగిపోవాలని కోరింది.. బందీలను విడిచిపెట్టకు పోతే సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించింది.