- బాలాజీ నాయక్ వీడియోతో బాధితుల్లో ఆందోళన
ఉమ్మడి నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లా పెద్ద అడిశర్ల పల్లి మండలం పలుగు తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధిక వడ్డీకి ఆశపడి తండాకు చెందిన బాలాజీ నాయక్ కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోట్లాది రూపాయలు డిపాజిట్‌గా ఇచ్చారు. నూటికి పది రూపాయల నుండి 16 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని ఏజెంట్లను పెట్టుకొని డబ్బులను వసూలు చేశారు.
గతంలో బాలాజీ నాయక్ ( BalajiNaik), అతని ఏజెంట్లను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసి బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వదిలిపెట్టారు. రెండు రోజుల క్రితం ఏజెంట్లుగా వ్యవహరించిన సర్దార్, రమేష్, రాజులు పలుగుతండాకు రాగా వారిని బాధితులు నిలదీసి వారి కార్లను స్వాధీనం (cars seized) చేసుకున్నారు.
మరోవైపు తాను కొంతమంది సన్నిహితుల వద్ద అప్పులు తీసుకున్న మాట వాస్తవమేనని వారికి తాను తిరిగి డబ్బులు ఇస్తానని ఏజెంట్లు అని చెప్పుకొని వారు తీసుకున్న అప్పులకు తనకు సంబంధం లేదని బాలాజీ నాయక్ వీడియో విడుదల (Video release) చేయడంతో బాధితుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.