Tense atmosphere | వాగ్వాదం.. ఉద్రిక్తం

Tense atmosphere | వాగ్వాదం.. ఉద్రిక్తం
- నామినేషన్ల కేంద్రం వద్ద టెన్షన్..
Tense atmosphere | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపల్ నామినేషన్ల కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యతో తమ అనుచరవర్గంతో తరలివచ్చారు. దీంతో నామినేషన్ కేంద్రం సమీప రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి. దీంతో నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎవరినీ అనుమతించవద్దని నిబంధనల కారణంగా పోలీస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ 14వ వార్డుకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు నిలదీశారు. తమకో న్యాయం అధికార కాంగ్రెస్ పార్టీకి ఓ న్యాయమా అంటూ ఆగ్రహించారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
