పెళ్లికి వెళ్లి వస్తుండగా…
జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల్ జిల్లా (Jogulamba Gadwal District) లో పెళ్లి బృందం వాహనం బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. కర్నూల్‌లో వివాహ కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తున్న పెళ్లి బృందం ఇటుకలపాడు సమీపంలో దుర్ఘటనకు గురైంది. పెళ్లి బృందాన్ని తరలిస్తున్న డిసిఎం (DCM) వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో దాదాపు పది మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరికి చేతులు, కాళ్లకు ఫ్రాక్చర్లు అయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే అల్లంపూర్, ఉండవల్లి 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రక్షణ చర్యల్లో EMT శేఖర్, పైలెట్ నరేష్ ప్రత్యేకంగా సహకరించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారు..
1.నూర్ అహ్మద్ (55)
2.భాష (24)
3.నస్రీన్ (22)
4.భాష (45)
5.షన్ బీ (35)
6.రాజీయ (50)
7.అబ్దుల్ హుస్సేన్ (15)
8.అబూబాకర్ (6)