వైభవంగా ఎదురుకోల ఉత్సవం

వైభవంగా ఎదురుకోల ఉత్సవం

గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం శేష వాహన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చనలు, నిత్య హోమము, బలిహరణ, నవ కుంభారోపణ, నీరాజన మంత్ర పుష్పం కార్యక్రమాలు ప్రధాన అర్చకులు తిరుణఘరి గోపాలాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కళ్యాణ పీటలపై కూర్చునే పలువురు దంపతులు యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారు శేషవాహనారూఢులై తిరువీధుల్లో వేంచేసారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద స్వామి వారు, రుక్మిణీ, సత్యభామ అమ్మవార్ల ఎదురుకోల మహోత్సవం మేళతాళాలతో అంగరంగ వైభవంగా చేపట్టారు. ఆలయ సహాయ కమిషనర్ నేల సంధ్య, అధ్యక్షురాలు కావూరి శశిరేఖ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు బెల్లం మధుసూదన రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply