Temple | బాసర అమ్మవారి సన్నిధిలో పూజలు

Temple | బాసర అమ్మవారి సన్నిధిలో పూజలు
Temple | బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి(Sri Jnana Saraswati Devi) అమ్మ వారి సన్నిధిలో ఈ రోజు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి(Madhavi) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవిచే ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అర్చకులు వేద పండితులు ప్రత్యేక కుంకుమార్చన పూజ జరిపించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆశీర్వచన మండపంలో హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవిని పట్టు వస్త్రాల(silk robes)తో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ చరిత్ర విశిష్టతను ఆలయ అర్చకులు అధికారులు వివరించారు. కార్యక్రమంలో బైంసా మజిస్ట్రేట్ దేవేందర్ బాబు, ఆలయ ఈవో అంజనీదేవి, ముధోల్ సీఐ మల్లేష్, బాసర సీఐ సాయికుమార్, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

