Temple | ఘనంగా వైకుంఠ ఏకాదవి పూజలు

Temple | ఘనంగా వైకుంఠ ఏకాదవి పూజలు
Temple | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు కొల్లాపూర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం(temple)లో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కొల్లాపూర్ నియోజక వర్గ(constituency) ప్రజలపైన సమాజం పైన అందరి భక్తులపైన పుష్కలంగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.



అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదానాలు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఆలయ కమిటీ సభ్యు లు మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండలం సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, జూపల్లి నాయకులు పాల్గొన్నారు.
