Temple | ఆలయ నూతన కమిటీ నియామకం…

Temple | ఆలయ నూతన కమిటీ నియామకం…

Temple | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని పెద్ద బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీని నియమించారు. ఈ రోజు బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఈ కమిటీని ఖరారు చేశారు. ఈ సందర్భంగా సభ్యులకు అధికారిక నియామక పత్రాలను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా సోమగూడెం చెందిన దూడ మహేష్ నియామకమయ్యారు.

డైరెక్టర్లుగా తాండూర్ కు చెందిన కోరల పుష్ప, కన్నాలకు చెందిప మంద ఉదయ్ వికాస్, బెల్లంపల్లి పట్టణానికి చెందిన పెద్ది రాజేందర్, అంకుశంకు చెందిన చిలువేరు అరవిందు, చిన్నభూదకు చెందిన మీస రమేష్, రామకృష్ణాపూర్ కు చెందిన సుంకరి రాజేష్ లను ఎమ్మెల్యే ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక కేంద్రమని, ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు.

ముఖ్యంగా రానున్న మహాశివరాత్రి పర్వదిన వేడుకలను నూతన కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున, తన వంతుగా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply