Temple | ఆలయాల్లో ముక్కోటి శోభ

Temple | ఆలయాల్లో ముక్కోటి శోభ

Temple | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ముక్కోటి ఏకాదశి(Mukkoti Ekadashi) వేడుకలు ఘనంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

స్వామివారిని ఉత్తర ద్వారం దర్శించుకోవడానికి వేకువజామునే భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు దీరారు. ఆలయ ప్రార్థన(temple prayer) అర్చకులు నందనాచార్యులు, రాంబాబు ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్ కు చేసిన విశేషాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ వేముల విజయ్ పాల్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మార్క శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply