Temple | గోదారంగనాయక స్వామి కళ్యాణం విజయవంతం చేయండి

Temple | గోదారంగనాయక స్వామి కళ్యాణం విజయవంతం చేయండి
Temple | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : గోదారంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ వేముల విజయపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన మంగళవారం ధనుర్మాసం చివరి రోజు భోగి పండుగ రోజున శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం(Sri Goda Ranganatha Swamy Kalyanam) అంగరంగ వైభవంగా జరుగుతుందని భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
విగ్రహ దాత, కళ్యాణ శాశ్వత దాత మాడుగుల సోమయ్య విజయలక్ష్మి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నందనాచార్యులు, రాంబాబు ఆచార్యులు, జూనియర్ అసిస్టెంట్ మార్గ శేఖర్ తదితరులు ఉన్నారు.
